మనలో కొందరికి మెడ భాగంలో నల్లగా ఉండడం గమనిస్తుంటాము. దీనివల్ల మనం ఇతరులకు అందవిహీనంగా కనిపిస్తామేమోనని భయపడుతుంటారు. దాంతో ఈ నలుపుదనం తొలగించుకోవడానికి వివిధ రకాల చిట్కాలు పాటిస్తుంటాము. వాటితో పాటు ఈ ఇంటి చిట్కాను ఉపయోగించి ఎటువంటి ఖర్చు లేకుండానే సమస్య నుండి బయట పడవచ్చు.
మెడ చుట్టూ నల్లగా కావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఎండకు ఎక్కువగా తిరగడం, అధిక బరువు, హర్యోన్ల అసమతుల్యత, గర్భధారణ, మెడ భాగాన్ని సరిగ్గా శుభ్రపరుచుకోకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. మెడ నలుపును తొలగించే ఆ ఇంటి చిట్కా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అలోవెరా జెల్ సహజంగా ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు మెడ భాగం పై అప్లై చేసుకుని ఉదయాన్నే వాష్ చేయండి ఇలా చేస్తే తరచుగా మీ మెడ భాగం లో నలుపుదనం తగ్గిపోతుంది. దాంతో చర్మం రంగు మెరుగుపడుతుంది. మెడ భాగం నల్లబడినప్పుడు పాలను అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.