రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

0
35

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతన్నలు తీసుకునే 3 లక్షల రూపాయల లోపు రుణాలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో రైతులకు కొంతమేర లబ్ది చేరనుంది. కాగా 2022-23 ఆర్ధిక సంవత్సరం నుంచి 2024-25 వరకూ ఇది వర్తించనుంది.

ఈ నిర్ణయం వల్ల కేంద్రంపై 34,856 కోట్ల రూపాయల భారం పడుతుంది. వ్యవసాయ రంగానికి రుణ లభ్యత పెరుగుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రైతులు తీసుకునే స్వల్పకాలిక రుణాలకు గతంలో లాగే 4 శాతం వడ్డీ వర్తిస్తుందన్నారు.

కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆతిథ్య రంగానికి ఊతమిచ్చేలా మరో కీలక నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ ప్రకటించింది. హాస్పిటాలిటీ అనుబంధ రంగ సేవలందించే సంస్థలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ప్రకటించింది. దీని ద్వారా అందిస్తున్న నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలకు అదనంగా మరో 50 వేల కోట్లు కేటాయించింది. ఈ స్కీమ్ కింద 2022 ఆగస్ట్ 5 వరకూ 3.67 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశామని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకుర్ తెలిపారు.