స‌బ్జా గింజ‌ల‌ను ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారట..!

0
99

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సమస్యకు మారిన జీవ‌న విధానం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, కొవ్వు క‌లిగిన ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం వంటి కారణాలు వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య కారణంగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

అందుకే ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల చిట్కాలు పాటిస్తుంటారు. వాటితో పాటు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. స‌బ్జా గింజ‌లను ఉపయోగించి ఎలాంటి ఖర్చు లేకుండా త్వరగా బరువు తగ్గవచ్చు. స‌బ్జా గింజ‌ల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ గింజ‌ల‌ను నీటిలో వేసి నాన‌బెట్టుకోవాలి.

ఇవి విస్త‌రించి తెల్ల‌గా మారిన త‌రువాత ఆ నీటిని..ఆహారం తీసుకోవ‌డానికి ముందు తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌డును నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో మ‌నం త‌క్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటాం. స‌బ్జా గింజ‌ల పానీయాన్ని త‌ర‌చూ తీసుకుంటూ ఉండ‌డం వ‌ల్ల త‌క్కువ స‌మ‌యంలోనే అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.