వన్ నేషన్- వన్ ఛార్జర్..కేంద్రం మరో కీలక నిర్ణయం

0
37

ఇప్పుడు అందరి ఇళ్లలో ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ పెరిగిపోయాయి. ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌, ట్యాబ్స్ అన్ని కూడా వాడుతున్నాం. అయితే ఒక్కొదానికి ఒక్కో ఛార్జర్‌ ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడికైనా వెళ్లాలన్నా అవన్నీ కూడా తీసుకెళ్లాలి.. దీని కారణంగా ఈ వేస్ట్‌ బాగా పెరిగిపోతుందని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

‘వన్ నేషన్-వన్ చార్జర్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీని ప్రకారం అన్ని గ్యాడ్జెట్లకు ఒకే రకమైన చార్జర్ వాడాల్సి ఉంటుంది. అంటే ఒక చార్జర్‌తో ఏ గ్యాడ్జెట్ అయినా చార్జ్ చేయవచ్చు. దీనివల్ల వేరువేరు చార్జర్లకు అడ్డుకట్టపడబోతుంది. దీనికి సంబంధించిన మీటింగ్ బుధవారమే జరిగింది. వివిధ గ్యాడ్జెట్ తయారీ సంస్థలతో కేంద్రం ఈ అంశంపై చర్చలు జరిపింది.

భవిష్యత్తులో రాబోయే గ్యాడ్జెట్లు అన్నింటికీ ఒకే రకమైన చార్జర్ వాడగలిగేలా ఉత్పత్తుల్ని తయారు చేయాలని సూచించింది. ఈ నిర్ణయం అమల్లోకి రావడాకి కాస్త సమయం పట్టినా, ఇది వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది. ల్యాప్‌టాప్ చార్జర్‌తో మొబైల్ కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఒకే చార్జర్‌ను కుటుంబ సభ్యులంతా కలిసి వాడుకోవచ్చు. చార్జర్ రాని గ్యాడ్జెట్లకు కొత్త చార్జర్ కొనాల్సిన అవసరం లేదు. అలాగే చార్జర్ పాడైతే మరో చార్జర్ కొనాల్సిన అవసరం లేకుండా, ఇతరుల చార్జర్ కూడా వినియోగించుకోవచ్చు.