టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్..దిల్ రాజు ఏమన్నారంటే?

0
87

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇక దీనికి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ..ఇంకా షూటింగ్ లు ఎప్పుడు ప్రారంభం కావాలి అనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఆగస్టు 1 నుంచి షూటింగ్ లు ఆపేసి కమిటీలు వేసుకున్నాం.. నిర్మాతలుగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము.

8 వారాల తరువాత ఒటిటిలోకి సినీమా ఇవ్వాలనీ నిర్ణయం తీసుకున్నాము. టికెట్ రేట్లు గురించి కూడా నిర్ణయం తీసుకున్నాం.. థియేటర్స్ యాజమాన్యంతో, మల్టీప్లెక్సులతో మాట్లాడాము. ఇక సినిమాలో ఎందుకు వృధా ఖర్చు అవుతుందని మాట్లాడుతున్నాం. 3, 4 రోజుల్లో ఫైనల్ మీటింగ్స్ ఉన్నాయి అవి అయ్యాక ఫైనల్ అవుతుంది.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించారు. మనం షూటింగ్ లు ఆపి ఏం చేస్తున్నాం ఆని బాలీవుడ్ ఆతృతగా చూస్తుందని దిల్ రాజ్ అన్నారు.