ఈ సమయం కన్నా ఎక్కువసేపు నిద్రపోతే ప్రాణానికే ప్రమాదమట..

0
36

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రపోయేవారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. కానీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని రక్షించడంలో నిద్ర ఎంతటి పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఎవరైనా సరే 8 గంటల నిద్రపోవడం తప్పనిసరి. కానీ నిర్దేశించిన సమయం కాకుండా అంతకన్నా ఎక్కువ గంటలు నిద్రపోతే చాలా దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రోజుకు 8 గంటల కన్నా ఎక్కువ సమయం నిద్రించే వారిలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా అతిగా నిద్రించడం వల్ల బరువు కూడా పెరుగుతారు. అందుకే బరువుతగ్గాలనుకునే వారు నిద్రవిషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. అంతేకాకుండా  తలనొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సంతాన సాఫల్యత సమస్యలు వస్తాయి. అతిగా నిద్రించే వారు త్వరగా చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా పగటిపూట నిద్రపోయే  అలవాటును ఉన్నవారు వీలయినంత త్వరగా మానుకోవడం మంచిది.