ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని పాఠశాలల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 502 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు అక్టోబర్ 23న రాతపరీక్ష నిర్వహించనుండగా నవేంబర్ 4వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పోస్టులలో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, మ్యూజిక్ ఉపాధ్యాయులు, ఆర్ట్ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్ (స్కూల్ అసిస్టెంట్స్), ఏపీ మోడల్ స్కూల్స్, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల ఖాళీలు ఉన్నాయి.