నిద్ర సరిగ్గా పట్టడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి..

0
38
Dreams in blue

మనిషికి తిండి తర్వాత అత్యంత ముఖ్యమైనది నిద్ర. కంటి నిండా నిద్రపోతేనే మరుసటి రోజు సరిగా పని చేయగలం. మరి కొంతమంది నిద్ర పట్టక రాత్రంతా ఇబ్బందులు పడుతుంటారు. మరి కంటి నిండా నిద్ర కోసం కొన్ని చిట్కాలు పాటించండి.

5 నిమిషాల శ్వాస..
అయిదు నిమిషాలు దీర్ఘశ్వాస తీస్తూ, నెమ్మదిగా గాలిని వదులుతూ యోగా చేసినా మెదడుకు విశ్రాంతి దొరకుతుంది. ఇదే సమయంలో గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించి, టెన్షన్‌ లేకుండా నిద్రకు సిద్ధం చేస్తుంది.

30 గ్రాముల ఫైబర్‌..

సరైన మోతాదులో ఫైబర్‌ తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. నిద్రలో గాఢత సమయాన్నీ పెంచుతుంది. విశ్రాంతి, అలసట తీరి నూతనోత్తేజంతో తర్వాత రోజును ప్రారంభించాలంటే ఇది అవసరం. ఓట్స్‌, పప్పులు, పండ్లు, కూరగాయల ద్వారా ఫైబర్‌ని తగినంత తీసుకోవాలి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే ఇంకా మంచిది.

10 నిమిషాల సంగీతం..

వర్షం, పక్షుల కిలకిలలు, చెట్ల కదలికల్లాంటి ఆహ్లాదకరమైన సంగీతం వింటే.. మనసు తేలికవుతుంది. ఇవి మెదడుని ప్రశాంతంగా ఉంచుతాయి. నిద్రకు ముందు పది నిమిషాలపాటు వీటిని వినాలి. రాగ యుక్తంగా ఉండే వేద మంత్రాలు విన్నా ఇలాంటి ప్రభావం ఉంటుంది.

6 నిమిషాల చదువు..
నిద్రలేమి కారణాల్లో ఒత్తిడి ప్రధానమైనది. నిద్ర పోవడానికి ముందు కనీసం ఆరు నిమిషాలు చదివితే.. 68 శాతం ఒత్తిడి తగ్గుతుంది.

25 డిగ్రీల ఉష్ణోగ్రత..
సాయంత్రానికి శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. కాబట్టి బెడ్‌రూమ్‌లోనూ కాస్త చల్లగా ఉండటం ముఖ్యం. 25-26 డిగ్రీల వాతావరణంలో నిద్ర బాగా పడుతుంది.