ఇద్దరు మంత్రులకు ఫోస్ చేసి మరీ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జగన్

ఇద్దరు మంత్రులకు ఫోస్ చేసి మరీ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జగన్

0
93

ఇద్దరు మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోస్ చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… జగన్ వందరోజుల పాలన పూర్తి అయిన తర్వత పార్టీలో వర్గ విభేదాలు పుట్టలు పుట్టలుగా తేలుతున్నాయి..

ఇటీవలే గుంటూరు జిల్లాలో వర్గవిభేదాలు సర్దుమనుగకముందే విశాఖలో వైసీపీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి… తాజాగా పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అలాగే మరో మంత్రి ద్రోణం రాజులు గ్రామ సచివలాయ ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ కార్యక్రమానికి హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ గ్రామస్థాయి లెవెల్లో ప్రజల కష్టాలు ద్రోణంకు తెలియవని అన్నారు… దీంతో ద్రోణం అందిపుచ్చుని… అవంతి విశాఖకు వలస వచ్చారని అరోపించారు తన మంత్రి పదవికావాలంటే ఇస్తానని అన్నారు… ఇక ఈ విషయం జగన్ దృష్టికి చేరడంతో వీరిద్దరికి జగన్ కాల్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.