వందే భారత్ ట్రైన్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి రికార్డు సృష్టించింది. ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో తాజాగా ట్రైల్ రన్ రైల్వే శాఖ నిర్వహించింది. కోటా నుంచి మహిద్‌పూర్ రోడ్ స్టేషన్‌వరకు 180 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ దూసుకెళ్లింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ట్వీట్ చేసి వివరాలను వెల్లడించారు.
https://www.facebook.com/rajashekar.konda.351/videos/3331351043806130
టెస్ట్ రన్ నిర్వహిస్తున్న సమయంలో రైలులో వాషింగ్, క్లీనింగ్‌తో పాటు అన్ని పరికరాల పనితీరును పరిశీలించినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. కోటా-నాగ్డా రూట్లో రైలు స్పీడ్ లెవల్స్‌ను టెస్ట్ చేశారు. 16కోచ్‌లతో వందేభారత్ రైలును పరీక్షించారు. కోటా డివిజన్‌లో వివిధ దశల్లో ట్రయల్స్ చేపట్టారు.
వందేభారత్ రైలును పూర్తిగా ఇండియాలోనే తయారీ చేస్తున్నారు. దీన్ని సెమీ హై స్పీడ్ ట్రైన్‌గా పిలుస్తున్నారు. వందేభారత్‌కు ప్రత్యేక ఇంజిన్ ఉండదు. ఇందులో ఆటోమేటిక్ డోర్లు,AC చైర్ కార్ వంటివి ఉంటాయి. తక్కువ విద్యుత్తును వినియోగించుకునేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు.