వికటించిన ఆపరేషన్..ఇద్దరు మృతి..ఒకరి పరిస్థితి విషమం

0
102

తెలంగాణాలో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని లిమ్స్‌ ఆస్పత్రిలో ఓ మహిళ మృతి కలకలం రేపింది. కాగా ఈనెల 25న 27 మంది మహిళలకు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. అనంతరం ఆపరేషన్ జరిగిన 27 మందిలో ముగ్గురికి తీవ్ర అనారోగ్యం వాటిల్లింది. అందులో ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతి చెందారు. నిన్న బీఎన్‌రెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రిలో మమత మృతి చెందింది. అయితే మహిళల మృతికి ఆపరేషన్లు కారణం కాదని వైద్యాధికారులు తెలిపారు.