దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోంచి ఒక్కరోజులోనే కోలుకున్నాయి. మంగళవారం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఏకంగా 1564 పాయింట్లు పెరిగి.. 59 వేల 537 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 446 పాయింట్ల లాభంతో 17 వేల 759 వద్ద సెషన్‌ను ముగించింది.
అన్ని రంగాల సూచీలు గణనీయంగా పుంజుకున్నాయి. ఆటో, బ్యాంకింగ్, లోహం, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్, రియాల్టీ రంగాలకు చెందిన సూచీలు 2-3 శాతం మేర రాణించాయి.
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో అన్ని మంచి లాభాలను గడించాయి. బజాజ్ ఫిన్సర్వ్ అత్యధికంగా 5 శాతానికిపైగా పెరిగింది. బజాజ్ ఫినాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ కూడా పుంజుకున్నాయి.