ఏపీలో విషాదం నెలకొంది. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం శాంతి నగర్ వద్ద గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలపై రాళ్లు పడడంతో అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.