తిరుమల భక్తులకు అలెర్ట్..ఈ రోజుల్లో ఆలయం మూసివేత

0
118

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. నిన్న శ్రీవారిని 70,328 మంది భక్తులు దర్శించుకోగా 29,533 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

ఇక తాజాగా శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని అర్చకులు మూసేయనున్నారు. అక్టోబర్ 25న సూర్యగ్రహణం సందర్భంగా ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు స్వామి వారి ఆలయాన్ని మూసేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం ఉండటంతో ఆ రోజు కూడా ఉదయం 8:40 గంటల నుంచి రాత్రి 7:20 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసేస్తారు. గ్రహణం వీడగానే ఆలయ శుద్ధి అనంతరం గుడిని తెరవనున్నారు.

గ్రహణం కారణంగా ఈ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్, శ్రీవాణి, రూ.300 దర్శనాలు, ఆర్జిత సేవలు, అన్నీ రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం సర్వ దర్శనానికి మాత్రమే అనుమతిచ్చింది. భక్తులు ఈ మార్పులను గమనించాలని సూచించింది.