ముంబైలో ఘోరం..తెలుగు నటిపై జిమ్ ట్రైనర్ అత్యాచారం

0
145

సమాజంలో రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. కామాంధుల ఆగడాలకు మహిళలు బలవుతున్నారు. చిన్న పెద్ద, వావివరస మరిచి విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ తెలుగు నటిపై అత్యాచారం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఆదిత్య కపూర్ అనే ఫిట్ నెస్ ట్రైనర్ జిమ్ నడుపుతున్నాడు. అతని జిమ్ కు ఓ తెలుగు నటి వస్తుండేది. క్రమేణా వీరిద్దరికి పరిచయం పెరగగా ఆ చనువుతో పెళ్లి చేసుకుంటానని మోజు తీర్చుకున్నాడు ఆదిత్య కపూర్. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని, తన అశ్లీల చిత్రాలు ఆదిత్య దగ్గర ఉన్నాయని, వాటిని బహిర్గతం చేస్తానని బెదిరిస్తున్నాడని ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న, ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చిన కామాంధుల్లో మార్పు రావడం లేదు.  దేశంలో అత్యాచారాలు నిత్య కృత్యమయ్యాయి. కామాంధుల అఘాయిత్యాలకు ముక్కుపచ్చలారని చిన్నారుల నుండి సెలెబ్రెటీలు బలవుతున్నారు.