ఘోర రోడ్డు ప్రమాదం..గర్భస్థ శిశువుతో సహా ముగ్గురు మృతి

0
93

ప్రస్తుతం రోడ్డుప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రాంగ్ రూట్ వంటివి ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నాయి. ఇక తాజాగా కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిక్కబళ్లాపూర్ లోని జాతీయ రహదారిపై ఓ ట్రక్కు ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి బైక్ ను ఢీకొట్టింది. అలాగే రోడ్డు పక్కన ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గర్భిణీ కడుపులో ఉన్న శిశువుతో సహా ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.