టీ20 వరల్డ్ కప్..కోహ్లీ, రోహిత్, రాహుల్, పంత్, పాండ్య ఏం చేస్తారో మరి?

0
111

వచ్చే అక్టోబర్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ పైనే అందరి దృష్టి నెలకొంది. ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇండియా జట్లు హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగబోతున్నాయి. ఇక అంతకు ముందే ఇండియా ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఆయా జట్లు ఎంపిక ఈ మ్యాచ్ లపై ఆధారపడి ఉంది. ఇందులో రాణించిన వాళ్లే ప్లేయింగ్ లెవెన్ లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక తాజాగా టీమిండియాలోని ఈ ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కోహ్లీ:

ఈ మధ్య ఆసియా వరల్డ్ కప్ లో కసితో ఆడాడు కింగ్ కోహ్లీ. 1000 రోజులకు పైగా 70 మ్యాచ్ ల అనంతరం సెంచరీ కొట్టడం టీమిండియాకు, కోహ్లీకి పెద్ద ఊరట. మరి రాబోయే టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు.

రోహిత్: 

ఓపెనింగ్ లో రోహిత్ అనుభవం జట్టుకు కలిసి రానుంది. అలాగే ఆసియా కప్ లోను రోహిత్ రాణించాడు. రాబోయే టీ20లో కూడా ఇదే ఫామ్ ను కొనసాగిస్తే ఇండియాకు తిరుగుండదు.

రాహుల్:

ఆసియా కప్ లో రాహుల్ తడబడ్డాడు. క్లాసిక్ ఆటగాడిగా పేరున్న రాహుల్ ఫామ్ ఇప్పుడు ఇండియాను కలవరపెడుతుంది. రోహిత్ తో ఓపెనింగ్ చేసే రాహుల్ పవర్ ప్లేలో పరుగులు చేయకపోతే భారీ స్కోర్ చేయడం కష్టం. సో రాహుల్ ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది.

సూర్యకుమార్:

మిస్టర్ ఇండియా 360గా పేరు సంపాదించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. మైదానంలో అన్ని వైపులా షాట్లు ఆడగలిగే ఈ ప్లేయర్ టీ20 వరల్డ్ కప్ లో ఓ అస్త్రమే. ప్రస్తుతం అతను ఫామ్ లో ఉండడం ఇండియాకు సానుకూలాంశం.

హార్దిక్ పాండ్య:

ఇండియాకు చాలా రోజుల నుండి ఆల్ రౌండర్ కొరత ఉంది. హార్దిక్ ను గాయాల సమస్య వేధిస్తుండడం ఇండియాకు ప్రతికూలాంశం. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించే పాండ్య ఫిట్ నెస్ ను అందుకొని రాణిస్తే ఇండియాకు తిరుగుండదు.

పంత్:

పంత్ ఫామ్ లో లేకపోవడం ఇండియాకు గట్టి దెబ్బె. అయితే అతను ఫామ్ లోకి వస్తే ప్రత్యర్థికి చుక్కలే. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల ఆట అతని సొంతం. అలాంటి ఆటగాడు ఫామ్ లోకి వస్తే ఇండియాకు క్లిష్ట సమయాల్లో తోడుగా నిలబడ్డ వాడవుతాడు.