బాత్‌రూమ్‌ లో ఈ తప్పులు అస్సలు చేయకండి..!

0
77

సాధారణంగా మనం ఎంత పరిశుభ్రంగా ఉన్న కూడా అనేక ఆరోగ్యసమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకే ముఖ్యంగా బాత్‌రూమ్‌ లలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే..బాత్‌రూమ్‌ లలో రకరకాల క్రిములు నివసిస్తూ మనల్ని అనారోగ్య బారిన పడేలా చేస్తాయి. కావున బాత్‌రూమ్‌ లలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు.

ప్రస్తుతం మనలో చాలామంది బాత్‌రూమ్‌లో టూత్‌బ్రష్‌ ఉంచి మర్చిపోతుంటారు. దీనివల్ల ఆ వాతావరణంలో హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఒకవేళ ఆ బ్రష్‌తో పళ్ళను శుభ్రం చేసుకున్నట్లయితే ప్రమాదం పొంచివున్నట్టే. ఇంకా ఒళ్లు రుద్దుకునే పీచు లేదా స్క్రబర్‌ని కనీసం రెండు వారాలకోసారి శుభ్రపరచాలి.

బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్‌ వాడకం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఫోన్ వాడే క్రమంలో ఆ గదిలోని హానికర సూక్ష్మక్రిములు ఫోన్‌ ఉపరితలం మీద చేరతాయి. దీనిఫలితంగా రకరకాల ఇన్ఫెక్షన్లు కలిగి అనారోగ్యకరం బారిన పడతారు.