తులసి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరుగా..!

0
122

తులసి ఆకులు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎందుకంటే తులసి, వేప ఇలా ప్రకృతిలో దొరికే అనేక ఔషధ మొక్కలు కడుపులో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల వంటి వాటితో పోరాడి మనల్ని కాపాడుతాయి. ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు చూద్దాం..

కేవలం తులసి ఆకులే కాకుండా తులసి గింజలు కూడా ఆరోగ్యానికి చేసే లాభాలు అన్నిఇన్ని కావు. తులసి గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో తులసి ఆకులు లేదా తులసి గింజలు తినడం వల్ల శరీరంలోని విషపూరిత పదార్థాలు, మలినాలు దూరమై హానికరమైన వ్యాధులను మనదరికీ చేరకుండా కాపాడుతుంది.

ఇంకా తులసి గింజలు మెదడు చురుగ్గా పనిచేయించడంలో సహాయపడతాయి. కావున పిల్లలకు రోజు తులసి గింజలు పెట్టడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. తులసి గింజలు తినడం వల్ల రోదనిరోధక శక్తి పెరుగుతుంది. మనకు ఒత్తిడి కలిగినప్పుడు కూడా తులసి గింజలు తినడం వల్ల మనస్సు శాంతపడుతుంది. అందుకే మన ఆరోగ్యం పదిలంగా ఉండడం కోసం రోజు తులసి గింజలను తీసుకోవాలి.