రూపాయి మారకం విలువ రోజురోజుకు క్షీణించటం, ద్రవ్యోల్బణం పెరగటం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా డాలర్‌తో మన కరెన్సీ మారకం 82 రూపాయలకు చేరువయ్యింది. దీంతో విదేశాల్లోని చదువుతున్న భారతీయ విద్యార్థులపై మరింత భారం పడనుంది. చదువుల కోసం దాచిన డబ్బుతో పాటు, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని విదేశాల్లోని పైచదువులు అభ్యసించే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రూపాయి మారకం విలువ తగ్గటం పెను భారంగా మారింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఉంటున్న విద్యార్థులకు జీవనం, ఫీజులు డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉండగా, అదనంగా సంవత్సరానికి ఒక్కో విద్యార్థిపై రూ.4 నుంచి రూ.5 లక్షల భారం పడుతోంది. విదేశీ ప్రయాణాల ధరలు సైతం పెరిగిపోవటంతో, అత్యవసర సమయాల్లో దేశానికి తిరిగి రావటం కూడా గగనం అవుతోందని విద్యార్థులు వాపోతున్నారు.
విదేశాల్లోని విద్యార్థులపై మరింత భారం
-
Previous article
Read more RELATEDRecommended to you
బైక్ కొనాలి అనుకుంటున్నారా? ఫ్లిప్ కార్ట్ లో అదిరే ఆఫర్!
బడ్జెట్ ధరలో మంచి బైకు కొనాలనుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్...
Flawless Skin: నల్లటి మచ్చలకు, ముడతలకు చింతపండుతో చెక్ పెట్టండి
Alltimereport: Flawless Skin - పింపుల్స్, యాక్నే వంటి సమస్యల కారణంగా...
TCS: వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే!
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే.. ఎంతోమంది...
Latest news
Must read
Dust Allergy | డస్ట్ అలెర్జీ ఇబ్బంది పెడుతుందా..? ఈ చిట్కాలు మీకోసమే..
డస్ట్ అలెర్జీ(Dust Allergy) అనేది చాలా సాధారణ సమస్య. కానీ చాలా...
IPL Auction 2025 | ఐపీఎల్ వేలం.. ఎవరు ఎంత పలికారంటే..
ఐపీఎల్ వేలం(IPL Auction 2025) మొదలైంది. ఇందులో భారత ఆటగాడు రిషబ్...