ఎనిమిదేళ్లకు పిల్లలు ఏం చేస్తారని అడిగితే ఎవరన్నా ఏం చెప్తారు? బుద్ధిగా స్కూల్‌కు వెళ్లటం, రావటం, హోం వర్కులు చేసుకోవటం చేస్తారని చెప్తారు కదా? కానీ విజయవాడ నగరానికి చెందిన యాసర్ల సాత్విక్ మాత్రం ఇందుకు భిన్నం. ఓ పక్క పాఠశాలకు వెళ్తూనే, మరోపక్క తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. సాత్విక్ గుంజీలు(సిట్-అప్స్) తీయటంలో దిట్ట. కేవలం 37 నిమిషాల వ్యవధిలో 1200 గుంజీలు తీసి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు సాత్విక్. ఈ ఏడాది జూలై 30న ఆన్‌లైన్‌లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధుల పర్యవేక్షణలో సాత్విక్ ప్రదర్శన ఇవ్వగా, ధ్రువీకరిస్తూ ఇటీవల ధ్రువపత్రం, పతకం జ్ఞాపికను అందజేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, శిక్షకుడు యు శ్రీనివాసరావు తర్ఫీదుతో విజయం సాధించినట్లు సాత్విక్ తెలిపాడు.
ఎనిమిదేళ్లకే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
-