sucide: తండ్రి, కొడుకు ప్రాణాలు తీసిన సెల్‌ఫోన్‌

-

సెల్‌ ఫోన్‌తోనే రోజూ గడపుతున్నావంటూ కొడుకును తండ్రి మందలించటంతో.. మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకొని మృతి చెందాడు. తన కుమారుడు తన వల్లే మరణించాడనే అపరాధ భావంతో తండ్రి కూడా ఉరివేసుకొని మృతి చెందాడు. ఈ విషాధకర ఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లా కుండ్రత్తూర్‌లోని పలన్‌తండలంలో జరిగింది. సుందర్‌ కుమారుడు నవీన్‌ పదో తరగతికి వచ్చినా.. చదవకుండా.. ఎక్కువుగా ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేసేవాడు. ఈ నేపథ్యంలో నవీన్‌ ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతూ కనిపించటంతో.. సుందర్‌ మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన నవీన్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన నవీన్‌ కుటుంబ సభ్యులు, అతడి మృతదేహాన్ని కిందకి దించి, రోదిస్తున్న సమయంలో.. తన వల్లే తన కుమారుడు చనిపోయాడన్న వేదనతో సుందర్‌ ఏడుస్తూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అనంతరం ఆయన కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఓ సెల్‌ఫోన్‌ కుటుంబంలో పెద్ద చిచ్చును రేపిందని స్థానికులు అనుకుంటున్నారు.

- Advertisement -

Read also: Minister Roja: పవన్‌‌‌ది రోజుకో మాట.. పూటకో వేషం

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...