amaravathi maha padayatra: పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తతంగా మారింది. అమరావతి రైతుల చేస్తున్న పాదయాత్ర ఐతంపూడిలో కొనసాగుతుంది. ఈ మహాపాదయాత్ర (amaravathi maha padayatra)లో మాజీ ఎమ్మల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయసాగారు. ఇదిలా ఉండగా, వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు సైతం ర్యాలీను చేపట్టారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. రెండు ర్యాలీలు ఎదురెదురు పడటంతో, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయినప్పటికీ, అమరావతి రైతులు మహా పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
- Advertisement -