Sourav ganguli: దాదా అని ముద్దుగా పిలుచుకునే సౌరవ్ గంగూలీ అంటే.. భారత క్రికెట్ గౌరవాన్ని శిఖరాగ్రానికి తీసుకువెళ్లిన అత్యుత్తమ కెప్టన్లలలో ఒకడు. ఆటతీరుతో పాటు. కెప్టెన్‌గా జట్టుకు అద్భుత విజయాలను అందించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 18తో బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా పదవీకాలం ముగియనుంది. తరువాత గంగూలీ ఏం చేయాలనుకుంటున్నారన్నదే అందరిలో మెదులుతున్న సందేహం. ఇందుకు సమాధానం దొరికిందని కొందరు అంటున్నారు. నెక్స్ట్ ఐసీసీ ఛైర్మన్‌గా గంగూలీకి ఛాన్స్ ఇచ్చేందుకు క్రికెట్ పెద్దలు అనుకుంటున్నారట. న్యూఢిల్లీలో భారత క్రికెట్ బోర్డు స్టేక్ హోల్డర్స్‌తో జరిగిన మీటింగ్ తరువాతే ఈ పుకార్లు బయటకు వచ్చాయి. ఇదే సమావేశంలో గంగూలీ(Sourav ganguli)కు ఐపీఎల్ ఛైర్మన్ పదవిని చేపట్టమని ఆఫర్ ఇచ్చారట. కానీ, దాదా మాత్రం ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారంట. బీసీసీఐకు అధ్యక్షుడిగా సేవలు అందించిన తరువాత, బీసీసీఐలోని సబ్ కమిటీకు హెడ్‌గా ఉండటం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారట.
Read also: పానీపూరీలను హాంఫట్ చేస్తున్న ఏనుగు