ఎమ్మెల్సీ అనంతబాబుకు (MLC Anantababu )ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్ట్ డిస్మిస్ చేసింది. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. గతంలో అనంతబాబు(MLC Anantababu) డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయగా… ధర్మాసనం కొట్టివేసింది. పోలీసులు 90 రోజుల్లో ఛార్జ్‌షీట్ వేయనందున బెయిల్ ఇవ్వాలని హైకోర్టును అనంతబాబు కోరారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కోర్టులో మూడు సార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరించడం జరిగింది.
- Advertisement -
Read also: లవర్స్ కూడా అక్కడకి ఒక్కసారి వెళ్లరు కదా.. మరి ఎలా కట్టారా..!