Minister Vidadala Rajini: మూడు రాజధానులకు ప్రజల మద్దతు తెలిసే.. ముందస్తు ప్లాన్‌తో జనసేన మాపై దాడులకు తెగబడిందని మంత్రి విడదల రజని ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ, జనసేన కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో మహిళా మంత్రులపై దాడులు చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద మంత్రుల కార్లపై దాడికి పవన్ కల్యాణే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ గర్జనలో పెద్దఎత్తున ప్రజలు మూడు రాజధానులకు మద్దతు తెలిపారన్నారు. విశాఖ నుంచి తిరుగు పయనమైన తమపై జన సైనికులు పెద్దఎత్తున కర్రలు, రాళ్లతో దాడి చేశారని దీనికి పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే పవన్ పాదయాత్రలు చేస్తున్నారని మంత్రి విడదల రజని (Minister Vidadala Rajini) విమర్శించారు.
Minister Vidadala Rajini: ముందస్తు ప్లాన్‌తోనే మాపై దాడులు
-