Revanth Reddy :మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేంవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మునుగోడు ఉప ఎన్నికలపై జూమ్ మీటింగ్ నిర్వహించి.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మనం బూత్ లెవెల్ నాయకులను సిద్ధం చేసుకుంటే వారిని కూడా కొంటున్నారు. ఇప్పటి వరకు మనం అద్భుతంగా పని చేసాము. ఇక నుంచి మరింత అప్రమతంగా ఉండాలి. టీఆర్ఎస్, బీజేపీలు మరింత దిగజారి పోయి నాయకులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు.’’ అని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వాళ్లు పూర్తి సమయం అక్కడే కేటాయించాలని, 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నియోజకవర్గంలో ఉంటు ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాలకు వేం నరేందర్ రెడ్డి ప్రణాళిక సిద్దం చేస్తారని వివరించారు. నవంబర్ 3 తర్వాత మునుగోడు ఎన్నికలలో పని చేసిన వారితో రాహుల్ గాంధీ జోడో యాత్రలో ప్రత్యేకంగా పాల్గొనే విదంగా ఏర్పాటు చేస్తున్నామని హామీ ఇచ్చారు. మునుగోడు ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని ఎవ్వరు నిర్లక్షంగా ఉండవద్దని Revanth Reddy కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.