Contact lenses: కంటి నొప్పి వస్తుందని ఓ మహిళ ఆసుపత్రికి వెళ్లింది. తీరా ఆమెను చెక్ చేసి చూసిన డాక్టర్‌కు పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే, కంటి మీద పొరలు పొరలుగా కాంటాక్ట్ లెన్స్‌లు ఉన్నాయి. దీంతో చికిత్స ప్రారంభించిన వైద్యరురాలు, ఏకంగా 23 లెన్స్‌లను కంటిపై నుంచి బయటకు తీశారు. అన్నింటినీ విజయవంతంగా బయటకు తీసేసినట్లు డాక్టర్ వెల్లడించారు. ఈ తంతంగం మెుత్తం ఉన్న ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. కంటిపై ప్రతిరోజు లెన్సులు (Contact lenses) ధరించే మహిళ, రాత్రి వాటిని తొలగించకుండానే నిద్రపోయేది. తిరిగి ఉదయం కొత్తవాటిని పెట్టుకోవటం మెుదలుపెట్టింది. ఇలా దాదాపు 23 రోజులు చేయటంతో.. ఆమెకు కంటినొప్పి రావటం మెుదలయినట్లు వైద్యురాలు తెలిపింది. “రాత్రి పూట లెన్స్‌లు తీసివేయటం మర్చిపోయి.. ఉదయం కొత్తవాటిని పెట్టుకోవటం అనేది చాలా కొత్త విషయం. ఇలా వరుసుగా 23 రోజులు జరిగింది. నా క్లినిక్‌లో వాటిని విజయవంతంగా తొలగించా” అంటూ వైద్యురాలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. లెన్సులతో ఎవరూ నిద్రపోకండి అని సూచనలు కూడా చేశారు.
https://www.instagram.com/reel/Cic7MNMMc_i/?igshid=MDJmNzVkMjY=