YS Viveka murder: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైయస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న విచారణపై తమకు నమ్మకం లేదనీ.. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బుధవారం ఈ కేసు విచారణకు రాగా, వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విచారణ జాప్యం విషయంలో సీబీఐపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, విచారణను ఏ రాష్టానికి బదిలీ చేయాలని కోరుకుంటున్నారని ప్రతివాదులైన ఉమాశంకర్ రెడ్డి, గంగిరెడ్డిలను సుప్రీం ప్రశ్నించింది. కర్ణాటకకు బదిలీ చేయాలనీ.. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం వద్దని సీబీఐ ధర్మాసనాన్ని అభ్యర్థించింది. కానీ, సునీత తరఫు న్యాయవాదులు మాత్రం, తెలంగాణకు బదిలీ చేసినా తమకు ఫర్వాలేదని సుప్రీం కోర్టుకు తెలిపారు. ఏపీ పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని సీబీఐ సుప్రీం కోర్టుకు వివరించింది. వివేకా హత్య (YS Viveka murder) కేసులో సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలేనని సీబీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సునీతారెడ్డి వాదనలన్నింటికీ సీబీఐ మద్దతు తెలిపింది.
YS Viveka murder: వివేకా హత్య కేసు ఇతర రాష్ట్రానికి బదిలీ
-