Rahul Gandhi: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో ముగిసింది. నేడు కర్ణాటకలోకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ.. ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా.. ఏపీలోని వ్యక్తులతో నేను అనుభవించిన ప్రేమ బంధం లోతైనది, దృఢమైనది అని పేర్కొన్నారు. మీరు చూపిన ప్రేమకు కాంగ్రెస్ కృషితో ప్రతిఫలం దక్కుతుందని తెలిపారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం.’’ అని అని Rahul Gandhi ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశారు.
Grateful to the people of Andhra Pradesh for their tremendous response to the Yatra. The bond of love I felt with people here is deep & strong.
The Congress shall reciprocate this love with hard work. We will fulfil the commitments made to the people of Andhra Pradesh. pic.twitter.com/85LmwY6FtB
— Rahul Gandhi (@RahulGandhi) October 21, 2022
Read also: బస్సులో చెలరేగిన మంటలు