Vangalapudi Anita: రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తోందని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని.. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. సీఎం జగన్ రెడ్డి అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారని.. దళితులమైన తమపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దారుణమన్నారు. సిఐడి ఛీఫ్ సునీల్ సిఎంకు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారని.. ఏపీ సిఐడి తమ పై కావాలని కేసులు పెడుతుందని మండిపడ్డారు.సాటి దళితుడు డాక్టర్ సుధాకర్ పై పిచ్చోడనే ముద్రవేసి చనిపోయేలా చేశారని.. అంబేద్కర్ వారసుడు అని చెప్పుకునే అర్హత సిఐడి ఛీఫ్ సునీల్ కుమార్‌కు లేదన్నారు.
ఎస్సీ సబ్ ప్లాన్ ని నిర్వీర్యం చేసిన సీఎం దగ్గర సునీల్‌కు ఎలా పనిచేయాలనిపిస్తుంది? అని నిలదీశారు. గత ఏడాది పులివెందుల నియోజకవర్గంలో దళిత మహిళ హత్యకు గురైంది. దళిత మహిళకు మద్దతుగా పులివెందులలో ర్యాలీ చేసిన 21 మంది టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.. అయితే ఈ కేసులో టీడీపీ నేతలు వంగలపూడి అనిత (Vangalapudi Anita), ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు, స్ధానిక టీడీపీ నేతలు సోమవారం జిల్లా కోర్టుకు హాజరయ్యారు.
Read also: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం