Minister Botsa: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశమే లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు అవకాశం ఇచ్చారనీ.. చివరి వరకూ అధికారంలోనే ఉంటామని మంత్రి పేర్కొన్నారు. మరోసారి గెలిచి, ఐదేళ్లు అధికారంలో కొనసాగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీడీపీ-జనసేన పొత్తుల విషయంపై మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన కలుస్తాయని వైసీపీ ముందు నుంచే చెప్పిందనీ.. ఇప్పుడు అదే జరిగిందని మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీ కాపు నేతల సమావేశంలో పవన్ గురించే చర్చించామనేది సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కాపులకు ఏం చేసిందనేది వివరించేందుకే, రాజమండ్రిలో సమావేశం నిర్వహించినట్లు వివరించారు.
పాలనా పరంగా ప్రతి విధాన నిర్ణయానికీ ప్రజాభిప్రాయం తీసుకోవటం సాధ్యం కాదని మంత్రి బొత్స అన్నారు. ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే.. అప్పుడు పునారాలోచించే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాని మోదీ నోట్ల రద్దు దేశ ప్రజలందరికీ ముందే చెప్పి చేయలేదు కదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం కూడా సంస్కరణలు తీసుకొస్తుందన్నారు. రాష్ట్ర పిల్లల భవిష్యత్ కోసమే విద్యా విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa satyanarayana) పేర్కొన్నారు.
Read also: T20 :మేము భారత్‌ను ఓడించటానికి వచ్చాం: బంగ్లా కెప్టెన్