Challa Bhageerath Reddy is No More ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఆయన గత నెల 25న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఎంత ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. బుధవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రేపు తెల్లవారుజామున కర్నూలు జిల్లా అవుకులోని తన ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
- Advertisement -