congress candidate walkout from Munugode Bypoll counting center: హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ సెంటర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని పాల్వాయి స్రవంతి బయటకు వెళ్లిపోయారు. కాగా, పాల్వాయి స్రవంతి రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు బయల్దేరి వెళ్లారు. సిట్టింగ్ సీట్ పోతుందన్న భావన లేకుండా.. మునుగోడు ఎలక్షన్ కంటే.. జోడో యాత్రకే కాంగ్రెస్ ప్రాముఖ్యత ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటి వరకు వెలువడిన ఉప ఎన్నిక ఫలితాల్లో పాల్వాయి స్రవంతి వెనుకబడగా, టీఆర్‌ఎస్.. బీజేపీల మధ్య పోటీ నెలకొంది.