CM Jagan: ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నాం

-

CM Jagan Review Meeting Agriculture and grain Collection: వ్యవసాయం, ధాన్యం సేకరణపై ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలని సీఎం జగన్ పేర్కొన్నారు. సోమవారం వ్యవసాయం, ధాన్యం సేకరణ, కొనుగోలు ఆంశల పై సమీక్ష నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇ-క్రాపింగ్‌ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో సేకరణ కొనసాగాలన్నారు.

- Advertisement -

వ్యవసాయ శాఖతో పౌరసరఫాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యంత పటిష్ట విధానంలో ధాన్యం సేకరణ కొనసాగాలన్నారు. తక్కువ ధరలకే.. పంటను అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట రైతుల నుంచి రాకూడదని తెలిపారు. రబీకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి ఆర్బీకేలో ఉంచాలని ఆదేశించారు. ఈ భూసార పరీక్షల వల్ల ఏ ఎరువులు వాడాలి? అనే దానిపై స్పష్టత వస్తుందని సీఎం జగన్ (CM Jagan)  అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖమంత్రి కాకాణి, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...