Beauty Tips :ఇవి వాడితే.. మేకప్‌ కిట్‌ అవసరం రాదు..!

-

Natural Ways to look Beauty Tips for avoiding daily Makeup: ఫంక్షన్‌ ఏదైనా.. పండగ ఎలాంటిదైనా.. ఆడవారు కొత్త బట్టలతో పాటు.. వాటికి మ్యాచ్‌ అయ్యే, మేకప్‌ సరంజామాను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఫంక్షన్‌, పండుగలు సరేసరి.. మామూలు రోజుల్లో కూడా, బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మేకప్‌ వేసుకునే ఇంటి నుంచి కాలు బయటకుపెట్టే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ఇలా మేకప్‌తో రోజంతా ముఖాన్ని కప్పి ఉంచటం వల్ల ఎన్నో సైడ్‌ ఎఫెక్ట్‌ వస్తాయి. ముఖ్యంగా ముఖం రోజంతా మేకప్‌ పొరలతో నిండి ఉండటం వల్ల, ముఖంపై ఉన్న చర్మం క్రమంగా బరకగా మారతుంది. ఎందుకంటే ముఖంపై ఉంటే, కణాలు సరిగ్గా శ్వాస తీసుకోకపోవటంతో, మలినాలు చర్మం పై పొరపైనే ఉండపోవటమే. అతి మేకప్‌ కారణంగానే, మెుటిమలు, నల్లమచ్చలు ముఖంపై నుంచి తొలగిపోవు. మేకప్‌ అందంగా ఉండటానికి వేసుకుంటారు.. కానీ ఆ మేకప్‌నే సహజ అందాన్ని హరిస్తూ వస్తుంది. మరి సహజంగా మేకప్‌ లేకుండా ఎలా కనిపించాలో తెలుసుకోండి.

- Advertisement -

సన్‌స్క్రీన్‌ లోషన్‌ చర్మం నుండి వ్యర్థాలను, మలినాలను బయటకు పంపించటంలో ఎక్స్‌పర్ట్‌. బయటకు వెళ్లే 15 నిమిషాల ముందు సన్‌స్క్రీన్‌ లోషన్‌ అప్లై చేయటం వల్ల, నేచురల్‌గా చర్మంలో గ్లో కనిపిస్తోంది. పైగా ఇందులో ఎక్కువ రసాయనాలు ఉండకపోవటం వల్ల.. ముఖంపై చర్మానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎటువంటి లోషన్లు రాయకుండా, ముఖం మెరిసిపోవాలంటే.. ఉదయం లేవగానే.. కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి. డైలీ ఇలా చేయటం వల్ల మీ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. దీని వల్ల మీ చర్మ కూడా మెరిసిపోతుంది.

చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. పుష్కలంగా నీటిని తాగటం వల్ల, మలినాలు శరీరంలో పేరుకుపోకుండా బయటకుపోతాయి. దీనివల్ల చర్మంలో గ్లో కనిపిస్తుంది. అంతేగాకుండా ఎంతో ఆరోగ్యం కూడానూ. వారానికి ఒక్కసారైనా ముఖాన్ని సున్నితంగా స్క్రబ్‌ చేసుకోండి. దీనివల్ల ముఖంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. నేచురల్‌గా కనిపిస్తూ ఉండటానకి స్క్రబ్ చేయటం ఎంతో దోహదపడుతుంది. మరీ ఎక్కువుగా ముఖం రుద్దకండి. దీనివల్ల చర్మం సున్నతత్వాన్ని కోల్పోతుంది.

పసుపు, పెరుగు, శనగపిండి కలిపి, పేస్టులా చేసుకొని ముఖానికి వారానికి రెండుసార్లు డైలీ వాడి చూడండి. మరింక ఇతర ఏ మేకప్‌ ప్రొడక్ట్స్‌ వాడాల్సిన అవసరం రాదు. ఎందుకంటే, పసుపు, పెరుగు, శనగపండి ప్యాక్‌ ముఖాన్ని కాంతివంతగా చేయటంలో ఎంతో సాయపడతాయి. ఫాస్ట్‌ఫుడ్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌ను దూరం పెట్టండి. తాజా ఆకుకూరలు, పండ్లు తింటూ ఉండండి. ఆరోగ్యంతో పాటు అందాన్ని ఈ Beauty Tips మరింత పెంచుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...