Adavi Shesh: డ్యాన్స్ వీడియో షేర్‌ చేసిన అడవి శేష్‌.. ప్రశ్నించిన నాని

-

Adavi Shesh shares dance video of HIT-2: అడవి శేష్‌ డ్యాన్స్‌ చేసిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన సినీ హీరో నాని.. ఇలా కూడా చేస్తారా అని ట్వీట్‌ చేశారు. ఇదంతా సినిమా ప్రమోషన్‌లో భాగంగానే అని నెటిజన్లు అంటున్నారు. కాగా, నాని ప్రారంభించిన వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై క్రైమ్‌, థ్రిల్లర్‌ జోనర్‌లో హిట్‌-2 సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్‌ 2న రిలీజ్‌ కానుంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్ల జోరు పెంచింది. ఈ క్రమంలో వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ కార్యాలయానికి చేరుకున్న హీరో శేష్‌, హీరోయిన్‌ మీనాక్షి ‘ఉరికే’ పాటకు డ్యాన్స్‌ చేశారు. “ఇలా డ్యాన్స్‌ చేయం కాస్త సిగ్గుగానే ఉంది. అయినా మీకోసం ఏదైనా చేస్తా” అంటూ శేష్‌ (Adavi Shesh) వీడియో షేర్‌ చేశారు. ఈ వీడియోపై స్పందించిన నాని”నా ఆఫీస్‌ను ఇలా కూడా వాడొచ్చా?” అని ఫన్నీగా ప్రశ్నించారు. హిట్‌-2 సినిమాలోని ‘ఉరికే ఉరికే’ రొమాంటిక్‌ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఈ పాట అటు యూట్యూబ్‌లోనూ, ఇన్‌స్టా రీల్స్‌ చేయటంలో దూసుకెళ్తోంది. ఇదే పాటకు ఇప్పుడు శేష్‌-మీనాక్షి డ్యాన్స్‌ చేసి వీడియోను షేర్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...