High Court Rejects to cbi investigate Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌజ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో బీజేపీకి చుక్కెదురైంది. ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలన్న బీజేపీ విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ రోజు హైకోర్టులో బీజేపీ పిటిషన్‌పై జరిగిన విచారణలో సిట్ ఆధ్వర్యంలోనే కేసును దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. నిందితుల దర్యాప్తు నగర పోలీసు కిమషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగేలా చూడాలని సీజే బెంచ్ పేర్కొంది. దర్యాప్తు అనంతరం నివేదికను ఈ నెల 29న హైకోర్టుకు సమర్పించాలని ‘సిట్’కు సీజే బెంచ్ వెల్లడించింది.
- Advertisement -