Super Star Krishna: నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

-

Super Star Krishna Funaral with telangana state honors: సూపర్‌ స్టార్‌ కృష్ణ (79) మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. మల్టిపుల్‌ ఆర్గాన్స్‌ ఫెయిల్యూర్‌తో కృష్ణ కన్నుమూశారని కాంటినెంటల్‌ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కృష్ణ మరణ వార్తతో సినీ రంగం శోకసంద్రంలో మునిగిపోయింది. నేడు మధ్యాహ్నాం 3 గంటలకు జూబ్లీ హిల్స్‌ మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

- Advertisement -

ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కృష్ణ పెద్ద కుమారుడైన రమేష్‌ బాబు కుమారుడు ఇంకా అమెరికా నుంచి రావాల్సి ఉంది. ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ కృష్ణ భౌతిక కాయం మెుదటగా నానక్‌ రామగూడలోని ఆయన నివాసం ఉంచారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి గచ్చిబౌలి స్టేడియానికి అభిమానుల సందర్శనార్థం ఉంచారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కృష్ణను కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించి, మహేష్‌ బాబుకు ధైర్యం చెప్పారు. సోషల్‌ మీడియా వేదికగా పలువురు నివాళులర్పిస్తున్నారు. కృష్ణ (Super Star Krishna) మృతికి నివాళిగా నేడు థియేటర్లలలో ఫస్ట్‌ షోను రద్దు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Chandrababu | వంగవీటి రాధాపై చంద్రబాబు ప్రశంసలు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రశంసలు కురిపించారు....

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

త్వరలో అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత...