Telagana Govt introduce new portal for verification of Fake Certificates: తెలంగాణ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని నకిలీ సర్టిఫికెట్ల బెడదను తప్పించేందుకు చర్యలు చేపట్టింది. నకిలీ సర్టిఫికెట్ల తనిఖీకి ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల ఫేక్ సర్టిఫికెట్లకు చెక్ పెట్టనుంది గత కొన్ని రోజులుగా ఫేక్ సర్టిఫికెట్ల బెడద ఎక్కువైన విషయం తెలిసిందే. కొందరు కేటుగాళ్లు నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి.. ఎంతోమంది జీవితాలను తలకిందులు చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు చదివినట్లు బోగస్ సర్టిఫికెట్లు పుట్టించి.. డబ్బులు దండుకుంటున్నారు. ఇందులో ఆయా యూనివర్సిటీ వాళ్లు సైతం సాయం చేయటంతో.. కేటుగాళ్లకు పని సులువుగా అయిపోయింది. అదనంగా వచ్చే డబ్బు కోసం ఆశపడే, యానివర్సిటీలోని కొందరు ఈ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫేక్ సర్టిఫికేట్ల వల్ల అవకాశం ఉండి, అర్హత ఉండి ఎంతోమంది విద్యావంతులు నష్టపోతున్నారు. ఇది గమనించిన తెలంగాణ విద్యాశాఖ, ఇక ఫేక్ సర్టిఫికెట్ల (Fake Certificates) తో పబ్బం గడిపేస్తున్నవారికి మంగళం పాడనుంది.