Supreme court verdict on harrasments on Journalists: సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, జర్నలిస్టులకు వరంగా మారింది. ఇకపై జర్నలిస్టులను తిట్టినా, బెదిరించినా రూ. 50 వేల జరిమానాతో లేదా ఐదేళ్ల కఠిన కారాగార శిక్షార్హులు అవుతారని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో వృత్తిపరంగా ఎటువంటి భయాందోళనలకు తావు లేకుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని జర్నిలిస్టు సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు సంబరాలు చేసుకుంటున్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో రాజకీయ నేతల నుంచి జర్నలిస్టులకు రక్షణ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -