PSLV-C54: నేడే రోదసిలోకి ఓషన్‌ శాట్‌-3

-

PSLV-C54 Rocket will ber lanched from Shar: పీఎస్‌ఎల్‌వీ -సీ54 రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేసింది. షార్‌ నుంచి నేటి ఉదయం 11.56 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది. మన దేశానికి చెందిన 1,117 కిలోల ఓషన్‌ శాట్‌-3తో పాటు, మరో 8 ఉపగ్రహాలను నింగిలోకి పంపించనున్నారు. షార్‌లోని మెుదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 54 రాకెట్‌ ఎగరనుంది. ఈ ప్రయోగం ద్వారా ఓషన్‌ శాట్‌-3తో పాటు మరో 8 ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.  హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ధ్రువస్పేస్‌ రూపొందించిన థైబోల్ట్‌ 1, థైబోల్ట్‌ 2 ఉపగ్రహాలు మిగిలిన శాటిలైట్స్‌తో ప్రయోగించనున్నారు. ఈ రెండు ఉపగ్రహాలను పూర్తిగా, హైదరాబాద్‌లోనే నిర్మించినట్లు ధ్రువ స్పేస్‌ సీఈవో, సహా వ్యవస్థాపకుడు సంజయ్‌ నెక్కంటి వివరించారు. ఈ ఉపగ్రహాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా రేడియో ఆపరేటర్లకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ-సీ54 (PSLV-C54)  ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ శుక్రవారం నాడే షార్‌ సమీపంలో ఉన్న చెంగాళమ్మ ఆలయంతో పాటు, తిరుమల శ్రీవారి ఆలయంలో రాకెట్‌ నమూనాలకు ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...