Love Failure: లవ్‌ ఫెయిలా.. బాధపడకండి!

-

Love Failure Tips to get rid of the pain of Love failure:లవ్‌, ప్రేమ, కాదల్‌, ఇష్క్‌.. ఇలా ఏ భాషలో చెప్పినా.. ఆ అందమైన అనుభూతిని మాటల్లోనో.. అక్షరాల్లోనో చెప్పలేము. అదొక ప్రత్యేక అనుభూతి. ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు.. మనస్పర్థలు, పొరపొచ్చాలు రావటం సహజమే. కానీ అనుకోని పరిస్థితుల్లో.. ఇద్దరి మధ్య దూరం పెరిగి.. ప్రేమ బంధానికి బ్రేక్‌ పడితే.. ఆ బాధ వర్ణనాతీతం. లవ్‌ ఫెయిల్‌ అయినప్పుడే ధైర్యంగా ఉండాలి. లవ్‌ లైఫ్‌ ఒక్కటే జీవితం కాదనీ.. జీవితంలో ఇంకా సాధించాల్సింది ఉందని గుర్తుపెట్టుకోండి. మరి మీ భగ్నప్రేమ తాలూకా జ్ఞాపకాలు మరిచిపోవటానికి టిప్స్‌ కావాలా.. అయితే, తెలుసుకుందాం రండి..

- Advertisement -

ఓపికతో ఉండండి
సమయమే ప్రతిదీ నయం చేస్తుందన్న సామెతను నమ్మండి. క్రమంగా భగ్నప్రేమకు సంబంధించిన జ్ఞాపకాలు.. ఒక్కొక్కటిగా మరుపుకు వస్తాయి. కాస్త టైమ్‌ పట్టినా, ఓపికతో ఉండండి. పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే ప్రదేశాలు, అలవాట్లకు దూరంగా ఉండండి.

స్నేహితులతో మాటలు కలపండి
ప్రేమ విఫలం కావటం ఎంతో బాధకరమైనది. అటువంటి బాధలో మీకు అండగా నిలిచేది కుటుంబ సభ్యులు, స్నేహితులు అని గుర్తుపెట్టుకోండి. బాధలో మద్యం వంటి దురలవాట్లకు దగ్గర కాకండి. ఇవి శరీరాన్ని గుల్ల చేస్తాయే తప్పా.. గాయపడిన గుండెను సమాధానపరచలేవు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. ప్రేమ తాలూకా జ్ఞాపకాలను వారితో పంచుకోకండి.. దాని వల్ల వారిని సైతం బాధపెట్టే అవకాశం ఉంది. పాత ప్రేమకు సంబంధించిన విషయాలను వదిలేయండి.

మీ హాబీలపై దృష్టి పెట్టండి
పుస్తకాలు చదవటం, మ్యూజిక్‌ వినటం వంటి హాబీలు ఉండే ఉంటాయి.. లేదా పేయింటింగ్‌, గార్డెనింగ్‌ వంటి వాటిపై దృష్టి సారించండి. మీలో ఉన్న కళాకారులను బయటకు తీయండి. దీని వల్ల మనసంతా కొత్త పనులపై నిమగ్నమయ్యి.. పాత జ్ఞాపకాలు గుర్తుకు రావు.

గుర్తులు ఉంచుకోకండి
మీ ప్రేమకు గుర్తుగా ఇచ్చిపుచ్చుకున్న గిఫ్ట్‌లు ఉంటే, వారికి తిరిగి ఇచ్చేయండి.. లేదా ఇతరలకు దానం చేసేయండి. వాటిని మీతో పాటే ఉంటుకుంటే.. నిరంతరం వారే గుర్తుకు వచ్చే ప్రమాదం ఉంది. వారు గుర్తుకు వచ్చే.. ఎటువంటి గుర్తులను ఉంచుకోకండి. ఒకవేళ వారు గుర్తుకు వచ్చినా.. నేను డిస్టర్బ్‌ కాను.. నేను ఏంటో వారికి చూపించాలి.. నేనంటే నిరూపించుకోవాలి అని అనుకుంటే.. కసిగా మీ గోల్‌పై దృష్టి సారించండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...