Chandra babu: నియంతృత్వ పోకడలతో జగన్‌‌రెడ్డి పాలన :చంద్రబాబు

-

Chandra babu open letter to andhra pradesh people: ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ పోకడలతో రాష్ట్రంలో జగన్‌‌రెడ్డి పాలన సాగిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. రాష్ట్రంలో నెలకొన్నపరిస్థితుల గురించి రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ‘‘ అధికారంలో ఉన్నామని, తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాజ్యాంగ విలువల్ని పాటించడంలేదు. రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కుతూ ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరిస్తున్నారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం టెర్రరిజంతో ఆరాచక, ఆటవిక పాలన సాగుతోంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించినా…పాలకులు, పాలనను విమర్శించినా ప్రజలు, రాజకీయ పార్టీలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు. ప్రజా సమస్యలపై రాజకీయ పక్షాలు నిరసనలు తెలిపే హక్కు కూడా లేదన్నట్లు అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలియజేసే హక్కును హరిస్తున్నారు. కొంతమంది కళంకిత అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ తాము ప్రజలకు జవాబుదారీ అనే విషయాన్ని మరచిపోయారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించే చట్టసభలను దూషణలకు, అసత్యాలకు వేదికగా చేశారు. చట్టసభల గౌరవాన్ని తగ్గించారు. ప్రతిపక్షాలనే కాకుండా మీడియా, న్యాయ వ్యవస్థలపైనా దాడికి దిగుతున్నారు. న్యాయమూర్తులపై ఆరోపణలు చేసే స్థితికి వైసీపీ నాయకులు తెగించారు. అలాంటి వారిని వైసీపీ ప్రభుత్వ పెద్దలే రక్షించి, ప్రోత్సహించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.’’ అనిని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫోర్త్ ఎస్టేట్‌‌గా ఉన్న మీడియాను సైతం చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు రాజద్రోహం వంటి కేసులు పెడుతున్నారని. మీడియా ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలపై దాడులు పెరిగిపోయాయని బడుగు, బలహీన వర్గాలపై శిరోముండనాలు, హత్యాయత్నాలు, అక్రమ కేసులు నాటి నాజీ పాలనను గుర్తుకు తెస్తున్నాయని మండిపడ్డారు. ‘‘మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్‌‌ని నర్సీపట్నంలో ఎలా వేధించి చంపేశారో.. న్యాయం అడిగిన అబ్దుల్ సలాంను నంద్యాలలో ఎలా బలితీసుకున్నారో.. తమను ప్రశ్నించిన సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజును అక్రమ కేసులతో కస్టడీలో ఎలా చిత్రహింసలకు గురిచేశారో మీరంతా చూశారు.’’ అని పేర్కొన్నారు.

42 నెలల్లో ప్రభుత్వ విధానాలకు సంబంధించి దాదాపు 330 పైగా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావడం ప్రజా వ్యతిరేక పాలనకు అద్దం పడుతోందని వివరిరంచారు. వందల సంఖ్యలో కోర్టు ధిక్కార పిటిషన్లు గాడి తప్పిన వైసీపీ పాలనకు నిదర్శనం అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా పలువురు అధికారులు కోర్టు బోనులో నుంచోవాల్సిన దుస్థితి గతంలో ఎప్పుడూ లేదని.. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా లక్షల కోట్ల అప్పులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్‌‌కి ఇది అత్యంత ప్రమాదకరమని.. గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే ముందున్న రాష్ట్రం ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయిందని ప్రశ్నించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి?అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలంతా ఆలోచన చేయాలని సూచించారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా తాము చెప్పిందే రాజ్యాంగం అనే గర్వంతో విర్రవీగుతున్న వైసీపీ నేతలను ప్రజాక్షేత్రంలో శిక్షించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుంబిగించాలని.. లేకపోతే వైసీపీ శ్రేణుల ఆకృత్యాలు మీ ఇంటిని చుట్టుముడతాయన్నారు. దుర్మార్గులు మీ ఆస్తులను చెరబడతారని.. మీ ప్రాణాలకు ముప్పు తీసుకువస్తారని నేడు రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక పాలనపై ప్రజలందరూ ఏకమై రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలని.. లేకుంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుందని వివరించారు. భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజల హక్కుల రక్షణ కోసం ప్రతిపక్షపార్టీగా టీడీపీ చేసే పోరాటానికి ప్రజలంతా కలిసి రావాలని Chandra babu పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...