Whatsapp: అమ్మకానికి వాట్సాప్‌ యూజర్ల నెంబర్లు!

-

Whatsapp users data leak and sale on hacking community forum: మరోసారి మెటాకు చెందిన సంస్థ నుంచి యూజర్ల డేటా లీక్‌ అయ్యిందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. దాదాపు 50 కోట్ల మంది యూజర్ల ఫోన్‌ నెంబర్లు హ్యాకర్ల చేతికి చిక్కినట్లు సమాచారం. వాట్సాప్‌ నుంచి 48.7కోట్ల యూజర్లకు సంబంధించిన ఫోన్‌ నెంబర్లతో కూడిన డేటాబేస్‌ ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉన్నట్లు సైబర్‌ న్యూస్‌ నివేదిక వెల్లడించింది. 48.7కోట్ల వాట్సాప్ యూజర్ల ఫోన్‌ నెంబర్లతో 2022 డేటాబేస్‌ విక్రయిస్తున్నట్లు ఓ హ్యాకర్‌ ఓ హ్యాకింగ్‌ కమ్యూనిటీ ఫోరమ్‌లో ప్రకటన ఇచ్చినట్లు సైబర్‌ న్యూస్‌ నివేదక తెలిపింది. అమెరికా, యూకే,

- Advertisement -

ఈజిప్టు, ఇటలీ, సౌదీ అరేబియా సహా 84 దేశాలకు
చెందిన యూజర్ల నంబర్లను అమ్మకానికి పెట్టినట్లు ఆ కథనం వెల్లడించింది. అత్యధికంగా ఈజిప్టు నుంచే 4.5 కోట్ల మంది యూజర్ల డేటా చౌర్యానికి గురైనట్లు తెలిపింది. ఆ తరువాత ఇటలీ నుంచి 3.5 కోట్ల

మంది, అమెరికాకు చెందిన 3.2 కోట్ల
మంది, సౌదీ అరేబియా నుంచి 2.9కోట్లు, ఫ్రాన్స్ నుంచి 2 కోట్లు, టర్కీకి చెందిన 2 కోట్లు, యూకే నుంచి 1.1కోట్లు, రష్యా నుంచి దాదాపు కోటి మందికి సంబంధించిన డేటా అమ్మకానికి ఉన్నట్లు వెల్లడించింది. అమెరికా డేటా సెట్ అయితే 7వేల డాలర్లు, యూకే డేటా ధర 2500 డాలర్లు, జర్మనీ Whatsapp యూజర్ల నంబర్ల ధర 2 వేల డాలర్లుగా అమ్మకానికి పెట్టినట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

RGV | పరారీలో రాంగోపాల్ వర్మ..!

వివాదాల దర్శకుడు రాం గోపాల్ వర్మ(RGV) ప్రస్తుతం పరారీలో ఉన్నారంటూ వార్తలు...

Rashmika | పెళ్ళిపై స్పందించిన రష్మిక..!

‘పుష్ఫ-2’ మూవీ ఈవెంట్‌ను చెన్నై వేదికగా ‘వైల్డ్ ఫైర్’ నిర్వహించారు మేకర్స్....