Google Wallet | ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ వాలెట్ వచ్చేసింది

-

టెక్ దిగ్గజం google బుధవారం ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ వాలెట్(Google Wallet) ను విడుదల చేసింది. యూజర్లు ఈ యాప్ లో తమ బోర్డింగ్ పాస్ లు, లాయల్టీ కార్డులు, ఈవెంట్ టికెట్లు, ప్రజారవాణా పాస్ ల వంటివి సేఫ్ గా దాచుకోవచ్చు. బుధవారం నుంచే ఈ డిజిటల్ వ్యాలెట్ పని చేయడం ప్రారంభించింది. గూగుల్ పే యాప్ కి ఇది కాంప్లిమెంటరీగా అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

- Advertisement -

“గూగుల్ పే యాప్ ఎక్కడికీ పోదు. అది ఎప్పటికీ మా ప్రాథమిక పేమెంట్ యాప్ గా కొనసాగుతుంది. నాన్ పేమెంట్ కేసుల్లో గూగుల్ వ్యాలెట్(Google Wallet) ఉపయోగరకంగా ఉంటుంది” అని గూగుల్ ఆండ్రాయిడ్ జనరల్ మేనేజర్, ఇండియా ఇంజనీరింగ్ లీడ్ రామ్ పాపట్ల చెప్పారు. ఈ కొత్త సర్వీస్ కోసం ఎయిరిండియా, ఇండిగో, ఫ్లిప్ కార్ట్, పైన్ లాబ్స్, కోచి మెట్రో, పీవీఆర్, ఐనాక్స్ వంటి 20 భారతీయ బ్రాండ్లతో గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఈ వ్యాలెట్ పూర్తిగా సురక్షితమని, కస్టమర్ల ప్రైవసీ కాపాడుతుందని రామ్ చెప్పారు.

Read Also: అక్షయ తృతీయ రోజు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...