నా మద్దతు పవన్ కల్యాణ్‌కే: అల్లు అర్జున్

-

Pawan Kalyan – Allu Arjun | ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ గెలుపుతో పాటు కూటమి అభ్యర్థుల కోసం సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వస్తుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుకి మద్దుతుగా ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌, నేచురల్ స్టార్ నాని, హీరోలు రాజ్‌తరుణ్‌, తేజ సజ్జా, సంపూర్ణేష్‌ బాబు, నిర్మాతలు నాగవంశీ, ఎస్కేఎన్, బన్నీ వాసు.. ఇలా చాలా మంది తమ సపోర్ట్ తెలియజేస్తున్నారు.

- Advertisement -

ఇక మెగా హీరోలు వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇప్పటికే పిఠాపురంలో ప్రచారం కూడా నిర్వహించారు. ఇక నటులు పృథ్వీరాజ్, హైపర్‌ ఆది, సుడిగాలి సుధీర్‌, రాంప్రసాద్‌తో పాటు పలువురు జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు పవన్ తరుపున ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా పవన్ కల్యాణ్‌కు తన మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

“ప్రియమైన పవన్‌ కల్యాణ్‌ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నాను. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

Read Also: ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ వాలెట్ వచ్చేసింది
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...