Why Women Gain Weight :అందుకే పెళ్లి తరువాత బరువు పెరిగిపోతారు!

-

Why Women Gain Weight After Marriage And Reason: పెళ్లికి ముందు సన్నజాజిలా సన్నగా ఉండేదాన్ని.. పెళ్లి అయ్యాకే ఇలా లావుగా అయిపోయాను అంటూ మహిళలు అనటం వింటూనే ఉంటాం. పెళ్లయ్యాక మహిళలు ఎందుకు లావు అయిపోతారో అంతుబట్టడం లేదా.. అయితే లావు అవటం వెనుకున్న కారణాలు తెలుసుకుందాం రండి..

- Advertisement -

పెళ్లికి ముందు రోజూ వర్కౌవుట్‌లు, ఎక్స్‌ర్‌సైజ్‌లకు వెళ్తూ ఉంటారు. కానీ, పెళ్లి అయ్యాక వర్కౌట్‌లకు వెళ్లే సమయం ఉండదు. ఇదొక కారణం మహిళలు లావు అవటానికి. పెళ్లికి ముందు చదువు, ఉద్యోగం వంటి టెన్షన్లతో తిండిపై పెద్దగా శ్రద్ధ పెట్టరు. అంతేగాకుండా డైట్‌ మెయిన్‌టైన్‌ చేస్తూ ఉంటారు. దీంతో ఫిట్‌గా ఉంటారు. చదవటం వల్ల క్యాలరీలు సైతం ఎక్కువుగా ఖర్చు అవుతూ ఉంటాయి. కానీ, పెళ్లి అయిన తరువాత చదువు, ఉద్యోగానికి గ్యాప్‌ వస్తుంది. అంతేగాకుండా, అత్తింటికి వెళ్లిన తరువాత.. కొంచెంకొంచెం కొసరి తినటం సాధ్యం కాదు.. అక్కడ పూర్తిగా తినకుండా ఉండలేరు కాబట్టి.. క్రమంగా లావు అవుతూ ఉంటారు. చేసిన ఆహారం మిగిలిపోతుందేమో అని ఆలోచించి, ఆహారాన్ని వృథా చేయకుండా తినటానికి ట్రై చేస్తుంటారు.

లావు అవటానికి ఇదొక కారణం కూడాను. సంసార జీవితం ప్రారంభించిన తరువాత, భర్త వీర్యం వల్ల కూడా భార్యలు బరువు పెరుగుతారు. ఈ క్రమంలో గర్భవతి అయినప్పుడు, శరీర ధర్మం కారణంగా లావు అవుతూ ఉంటారు. కానీ ప్రసవించిన తరువాత కూడా, లావు తగ్గరు. ఎందుకంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగటానికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు వర్కౌట్లు చేసినా, లావు తగ్గటానికి సంవత్సరాల సమయం పట్టేస్తుంది. (Why Women Gain Weight)

పెళ్లి అయ్యాక విశ్రాంతి ఎక్కువ తీసుకోవటానికి వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల పగటిపూట సైతం నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటారు. పగటి నిద్ర లావు పెరగటానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతేగాకుండా, రాత్రుళ్లు ఎక్కువ సేపు మెలుకువగా ఉండటం.. పనులన్నీ ముగించే సరికి టైమ్‌ ఎక్కువగా కావటంతో కలత నిద్ర పట్టడం వంటివి కూడా బరువు పెరిగేందుకు కారణమవుతాయి. ఒక ఇంటికి కోడలిగా వెళ్లాక ఎన్నో బాధ్యతలు మోయవలసి ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి పెరగటంతో, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా బరువు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

పెళ్లి అయ్యాక ఆడవారు ఇంతమునుపులా తమ శరీరంపై శ్రద్ధ తీసుకోరు. పెళ్లికి ముందు ఫిట్‌గా ఉండటం కోసం చేసే కసరత్తులన్నీ క్రమంగా మానేయటంతో.. క్రమంగా ఫ్యాట్‌ కంటెంట్‌ పెరిగిపోయినా, అంతగా పట్టించుకోరు. తీరా పాత బట్టలు వేసుకునేటప్పుడు లావు అయిపోయాము.. డైట్‌ మెయిన్‌టైన్‌ చేయాలి అని అనుకుంటారు కాగీ.. ఇంట్లో పరిస్థితుల కారణంగా బ్యాచలర్‌గా ఉన్నప్పుడు కఠినంగా డైట్‌ పాటించే విధంగా ఉండలేరు. దీని కారణంగా పెళ్లి తరువాత ఆడవారు సహజంగా లావు అయిపోతారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....