MP Rammohan Naidu: మాయ మాటలతో జగన్ అధికారంలోకి.. ఎంపీ రామ్మోహన్‌

-

MP Rammohan Naidu fires on cm jagan: విభజన హామీలు కూడా సాధించలేని సీఎం జగన్ మూడు రాజధానులు ఏం నిర్మిస్తాడని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అపహాస్యం చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” అనే కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు మూడు రాజధానులు అనే అంశాన్ని.. తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రజలను ఉద్యోగులను తన మాయ మాటలతో మాయ చేసీ జగన్ అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. టీడీపీ చేపట్టిన “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’’ విజయవంతమవుతోందన్నారు. వైసీపీ నాయకులు ముందస్తు ఎన్నికల కోసం మాట్లాడుతున్నారంటే వైసీపీలో భయం మొదలైందని.. ఎన్నికలు రేపు వచ్చిన చంద్రబాబును గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన జగన్‌‌‌ రెడ్డి ఓటమి ఖాయం అని ధీమావ్యక్తం చేశారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...