AAP becoming national party with Gujarat vote, says Sisodia: ఆమ్ ఆద్మీ పార్టీ నేడు జాతీయ హోదా సాదించి చరిత్ర సృష్టించిందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్విట్ చేసారు. గుజరాతీయుల ఓట్లతోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిందని, తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో విద్య, ఆరోగ్య రాజకీయాలు ముద్ర వేస్తున్నాయని అన్నారు. ఇందుకు దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు.
ఓ పార్టీ జాతీయ హోదా పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాలలో రాజకీయపార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 2 సీట్లు, 6 శాతం ఓట్లు సాధించాలి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఆప్ కు గోవా లో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. గుజరాత్ లో కూడా కొన్ని స్థానాల్లో గెలిచే అవకాశం అనిపిస్తోంది. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ కి మున్సిపల్ కార్పొరేషన్ అఫ్ ఢిల్లీ ఎలక్షన్ లో సైతం ఆప్ ఘన విజయం సాధించి భారీ షాక్ ఇచ్చిన ఆప్.